తెలంగాణ

telangana

Errabelli Dayakar rao

ETV Bharat / videos

Errabelli on Junior Panchayat Secretaries : 'సమస్యలు పరిష్కరిస్తాం.. విధుల్లోకి చేరండి' - మహబూబాబాద్ జిల్లా వార్తలు

By

Published : May 9, 2023, 1:35 PM IST

Minister Errabelli on Junior Panchayat Secretaries : మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పర్యటించారు. రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరూ సాయంత్రంలోగా విధుల్లో చేరాలని సూచించారు.  ఉద్యోగాల్లో చేరేటప్పుడే సమ్మెల్లో పాల్గొనబోమని, యూనియన్లను పెట్టమని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారని వారికి గుర్తు చేశారు. కొందరి మాటలు విని తొందరపడి సమ్మెకు దిగారని అన్నారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యను త్వరలో సీఎం కేసీఆర్‌ పరిష్కరిస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో గత 11 రోజులుగా సమ్మె చేస్తున్న 9,350 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. లేని పక్షంలో ఉద్యోగాల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా నోటీసులు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details