Errabelli: 'స్వచ్ఛ పల్లెల స్ఫూర్తిని కొనసాగించాలి' - హైదరాబాద్ న్యూస్
Errabelli meeting with Sarpanches: పల్లె ప్రగతి కార్యక్రమం అమలుతో గ్రామాలకు మహర్దశ పట్టిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ప్రస్తుత స్వచ్ఛ పల్లెల స్ఫూర్తిని మున్ముందు కొనసాగించాలని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు సూచించారు. గ్రామాల్లో సాగుతున్న సామాజిక రుగ్మతలపైనా పోరాటం చేయాలని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ కోరారు. పంజాబ్‌లో యువత మాదక ద్రవ్యాలకు అలవాటై సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని గుర్తు చేశారు. అలా కాకూడదంటే పిల్లలను సన్మార్గంలో నడపాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వివరించారు. జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు పొందిన సర్పంచులు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వినోద్ కుమార్ సమావేశమై పలు అంశాల్లో దిశానిర్దేశం చేశారు.
ఈ నెల 17న దిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ జాతీయ పంచాయతీ అవార్డులు తీసుకోనున్నారు. ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన పంచాయతీల్లో.. గౌతంపూర్, నెల్లుట్ల, కొంగట్పల్లి, ఐపూర్ పంచాయతీలు మొదటి స్థానంలో నిలవగా.. మందొడ్డి, చీమల్దారి పంచాయతీలు రెండో ర్యాంక్‌లో నిలిచాయి.