Minister Botsa Satyanarayana Reaction On Chandrababu Skill Development Case: బంద్‌లు, ధర్నాలతో టీడీపీ నేతలు ఏం సందేశమిస్తున్నారు: మంత్రి బొత్స - మంత్రి బొత్స సత్యనారాయణ
Published : Sep 11, 2023, 9:28 PM IST
Minister Botsa Satyanarayana Reaction on Chandrababu Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఇదే అశంపై వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా విద్యాశాఖ మంత్రి సత్యనారాయణ చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. చంద్రబాబు ఎన్నో కుంభకోణాలు చేశారని ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డారని పూర్తి ఆధారాలతోనే అరెస్టు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబు చిట్టా విప్పి అన్ని కుంభకోణాలు బయటపెడతామన్నారు. బంద్‌లు, ధర్నాలతో టీడీపీ నేతలు ఏం సందేశమిస్తారని మంత్రి ప్రశ్నించారు.
ఈ స్కాంలో చంద్రబాబు పాత్ర ఉందని.. అధికారులు పక్కాగా ఆధారాలతో నిరూపించారని మంత్రి వెల్లడించారు. న్యాయస్థానం రిమాండ్ విధిస్తే.. టీడీపీ శ్రేణులు ధర్నాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెబినెట్ తీసుకున్న నిర్ణయం అయినా... స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జరిగిన అక్రమాలకు చంద్రబాబు పూర్తిగా బాధ్యుడని బొత్స పేర్కొన్నారు. రాజ్యాంగం, చట్టాలు అనేవి పకడ్బందీగా ఉంటాయని, ఎవ్వరినీ ఉపేక్షించబోవని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.