ఇంట్లో టీ తాగుతూ కూర్చున్న మైనింగ్ వ్యాపారి దారుణ హత్య
ఉత్తరాఖండ్ కాశీపుర్లోని జుడ్కా అనే గ్రామంలో దారుణం జరిగింది. మహల్ సింగ్ అనే వ్యాపారి ఇంట్లోకి చొరబడి కాల్పులతో చెలరేగారు ఇద్దరు దుండగులు. ఆ సమయంలో మహల్ సింగ్ ఇంటి గుమ్మం వద్ద టీ తాగుతూ కూర్చున్నాడు. దుండగులను గమనించిన అతడు అటువైపుగా వెళ్లాడు. ఈ క్రమంలో మహల్ సింగ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో మహల్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే ఇద్దరు దుండగులు బైక్‌పై ఘటనాస్థలి నుంచి పరారయ్యారు. ఈ ఘటనంతా స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST