తెలంగాణ

telangana

చిన్నారులతో స్వీట్​ షాప్​కు వెళ్లిన తండ్రి.. బైక్​ దిగేలోపే ఢీకొట్టిన మినీ వ్యాన్​

ETV Bharat / videos

చిన్నారులతో స్వీట్​ షాప్​నకు వెళ్లిన తండ్రి.. బైక్​ దిగేలోపే ఢీకొట్టిన మినీ వ్యాన్​.. అంతలోనే.. - తమిళనాడులో రోడ్డు ప్రమాదం

By

Published : Aug 21, 2023, 10:03 PM IST

Mini Luggage Van Collides With Bike :తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో బైక్​ను ఢీకొట్టింది ఓ మినీ లగేజ్​ వ్యాన్​. ఘటనలో తండ్రీకూతురు తీవ్రంగా గాయపడ్డారు. మిగతా వాహనాలను ఓవర్​ టేక్​​ చేసే క్రమంలో.. బైక్​ను మినీ లగేజ్​ వ్యాన్​ ఢీకొట్టినట్లు తెలుస్తోంది. మెట్టుపాళయం పట్టణంలో సోమవారం రాత్రి ఘటన జరిగింది.

తండ్రీకూతుళ్లకు తీవ్ర గాయాలు.. 
ఓ వ్యక్తి నలుగురు చిన్నారులను బైక్​పై ఎక్కించుకుని మీనాక్షి ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఐస్​క్రీమ్​ షాప్​కు వెళ్లాడు. సరిగ్గా చిన్నారులు బైక్​ దిగే సమయంలోనే అతివేగంతో వచ్చిన మినీ లగేజ్​ వ్యాన్​ వారిని ఢీకొట్టింది. దీంతో తండ్రీకూతురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనంతరం అప్రమత్తమైన స్థానికులు.. వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. ఎదురుగా ఉన్న ఓ కారు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదానికి కారణమైన వ్యాన్​.. మెట్టుపాళయం కరమడై వైపు వెళుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. 

ABOUT THE AUTHOR

...view details