తెలంగాణ

telangana

Ahmed Bala Attacked Sheikh Akbar

ETV Bharat / videos

పోలింగ్​ అనంతరం ఉద్రిక్తత - కాంగ్రెస్ అభ్యర్థిపై ఎంఐఎం అభ్యర్థి దాడి - హైదరాబాద్​ పొలిటికల్​ న్యూస్​

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2023, 10:48 PM IST

MIM Candidate Ahmed Balala Attacked Congress Candidate: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మలక్‌పేట కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్​పై ఎంఐఎం అభ్యర్థి ఎమ్మెల్యే అహ్మద్ బలాల దాడి చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం సైదాబాద్‌లోని జాకీర్‌ హుస్సేన్​ మైదానం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో పాటు మరో ఇండిపెండెంట్‌ అభ్యర్థి తనపై దాడి చేశారని షేక్ అక్బర్ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Clash between Congress and MIM : షేక్ అక్బర్​పై దాడి జరుగుతుందనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. లాఠీ ఛార్జీ చేసి గొడవపడుతున్న వారిని చెదరగొట్టారు. ఎంఐఎం అహ్మద్​ బలాల కిరాయి గుండా అక్బర్ .. మండి పడ్డారు. వారంతా కలిసి తనని చంపే ప్రయత్నం చేసేందుకే ఈ దాడికి పాల్పడ్డారని ఆయన వాపోయారు. ఇలాంటి వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా తొలగించాలని అక్బర్​ కోరారు. పోలీసులపై, ఈసీపై తనకు నమ్మకం ఉందని అక్బర్​ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details