జైలుకెళ్లొచ్చిన 'హీరోయిన్' దంపతులకు పాలాభిషేకం - పాలాభిషేకం
హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్ట్ అయి, ఇటీవల విడుదల అయిన మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్ రాణా దంపతులకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. 36 రోజుల తర్వాత శనివారం అమరావతిలోని తన సొంత ఇంటికి చేరుకున్న ఎంపీ నవనీత్ రాణా, రవి రాణాకు పాలాభిషేకం చేశారు స్వాభిమాన్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా చదువుతామని చెప్పగా వివాదం చెలరేగి.. ఇరువురిని అరెస్ట్ చేసి 14రోజు రిమాండ్‌కు తరలించారు. దీనిపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు నవనీత్. దిల్లీలోని హనుమాన్ ఆలయంలో చాలీసా పారాయణం చేశారు. ఈ కారణంగా.. 36 రోజులు అమరావతికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న వారికి ఘనస్వాగతం పలికారు అభిమానులు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST