Midhani Director Interview : చంద్రయాన్-3 సక్సెస్‌లో హైదరాబాద్ మిథాని కీలక పాత్ర - మిథాని డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ శంకర్ ఇంటర్వ్యూ
Published : Aug 29, 2023, 7:31 PM IST
Midhani Director Interview on Chandrayan 3 Success : అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటి వరకు ఏ దేశమూ చేరుకోని చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను సురక్షితంగా దింపి జయకేతనం ఎగురవేసింది. నాలుగేళ్ల కిందట చివరి క్షణాల్లో చెదిరిన కలను పట్టుదలతో ఇస్రో సాకారం చేసుకుంది. చంద్రయాన్-3 మిషన్‌లో తుది అంకాన్ని దిగ్విజియంగా పూర్తి చేసి భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. చంద్రయాన్-3 విజయంతో యావత్ భారతావని ఆనందంతో ఉప్పొంగింది.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి.. చంద్రయాన్ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సత్తా చాటింది. చంద్రయాన్-3 విజయం.. ప్రతి భారతీయుడి గుండె పులకించిన సమయం. ప్రపంచానికి భారత సత్తా చాటిన తరుణం. చంద్రుడి దక్షణ ధ్రువాన్ని ముద్దాడిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచిన క్షణం. అలాంటి మహా ఘట్టంలో తనవంతు పాత్ర పోషించింది హైదరాబాద్‌కు చెందిన మిశ్రధాతు నిఘమ్.. మిథాని సంస్థ. షార్‌తో గత నలభై ఏళ్లుగా సుదీర్ఘ అనుబంధం కొనసాగిస్తున్న మిథాని.. చంద్రయాన్‌లో వినియోగించిన పలు లోహాలను సైతం అందించి.. చంద్రయాన్ విజయంలో భాగస్వామిగా మారింది. ఈ సందర్భంగా మిథాన్ డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్.. గౌరీ శంకర్‌రావుతో మా ప్రతినిధి ముఖాముఖి..