తండ్రి ట్రైనింగ్.. చీరకట్టులో కోట ఎక్కిన 8 ఏళ్ల చిన్నారి.. ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా! - 8 ఏళ్ల వయస్సులో కోటలెక్కిన గృహిత
మహారాష్ట్రకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు సాహసయాత్రలకు సై అంటున్నారు. చీరకట్టులో ప్రమాదకరమైన జీవధాన్ కోటను ఎక్కారు ఠానేకు చెందిన హరిత, 8 ఏళ్ల గృహిత. దీంతో కోట ఎక్కిన అతి పిన్నవయస్కురాలిగా గృహిత రికార్డ్ సొంతం చేసుకుంది. వీరిద్దరూ తన తండ్రి సచిన్ విచారే ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. కొద్దిరోజుల క్రితం వారిద్దరు తమ తండ్రితో కలిసి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేందుకు సిద్దమయ్యారు. అయితే 3,800 అడుగుల ఎత్తులో హరితకు ఆరోగ్యం దెబ్బతినగా.. తను వెనుదిరిగింది. దీంతో గృహిత, ఆమె తండ్రి సచిన్‌లు కలిసి దిగ్విజయంగా ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. చలి, మంచు కారణంగా బేస్ క్యాంప్‌కు చేరుకోవడానికి వారికి 13 రోజుల సమయం పట్టింది. దీంతో మహారాష్ట్ర నుంచి ఎవరెస్ట్ అధిరోహించిన అత్యంత పిన్నవయస్కురాలిగా కూడా గృహిత నిలిచింది.