Meghalaya CM Sangma Meets Chief Minister KCR : ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమైన మేఘాలయ సీఎం సంగ్మా - kcr latest news
Published : Sep 7, 2023, 11:04 PM IST
Meghalaya CM Sangma Meets Chief Minister KCR :ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా సమావేశమయ్యారు. హైదరాబాద్ వచ్చిన సంగ్మా.. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మేఘాలయ సీఎంని సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్.. తేనీటివిందు ఆతిథ్యం ఇచ్చారు. కాసేపు ఇరువురు ముఖ్యమంత్రులు ఇష్టాగోష్ఠిగా పలు అంశాలపై మాట్లాడుకున్నారు. శాలువాతో సత్కరించి, మెమొంటో బహుకరించిన తర్వాత తిరుగు ప్రయాణమైన సంగ్మాకు.. కేసీఆర్ వీడ్కోలు పలికారు.
ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. తెలంగాణ, మేఘాలయ మధ్య పరస్పర భాగస్వామ్యంపై సమావేశంలో చర్చించినట్లు సంగ్మా తెలిపారు. దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణతో భాగస్వామ్యంతో మేఘాలయ ఐటీ రంగం, పారిశ్రామిక రంగాల్లో పురోగతి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్ద, చిన్న రాష్ట్రాలు అభివృద్ధిలో ఎలా భాగస్వామ్యం కాగలవన్న విషయంలో రెండు రాష్ట్రాలు నమూనాగా నిలుస్తాయని మేఘాలయ సీఎం పేర్కొన్నారు. సానుకూల ఫలితాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.