Mechanic Made Small Hamsa Vehicle : కేసీఆర్ ఉద్యమ దీక్షకు ప్రతికగా.. అతి చిన్న హంస వాహనం తయారు చేసిన మెకానిక్ - కేసీఆర్ హంస వాహనం వివరాలు
Published : Oct 14, 2023, 1:28 PM IST
Mechanic Made Small Hamsa Vehicle in Hyderabad : ప్రత్యేక రాష్ట్ర కోసం నాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆమరణ దీక్షకు గుర్తుగా హైదరాబాద్‌కు చెందిన మెకానిక్ హంస వాహన తయారు చేశారు. లిమ్కా బుక్ రికార్డు లక్ష్యంగా తయారు చేసిన అతి చిన్న సైజు హంస వాహనాన్ని(Hamsa Vahanam) హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా మెకానిక్ అశోక్ ఆ వాహనంపై ప్రయాణం చేసి అందరిని అబ్బుర పర్చాడు.
KCR Hamsa Vahanam Details : ఈ వాహనం ముందు చక్రం 7 మిల్లీ మీటర్లు, వెడల్ప 12 మిల్లీ మీటర్లు, వెనక చక్రం 8 మిల్లీ మీటర్లు, 50మిల్లీ మీటర్లు ఉందని అశోక్ తెలిపాడు. సీఎం కేసీఆర్ 'ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో(KCR Initiation)' అని 11 రోజుల పాటు దీక్ష చేశారన్నారని గుర్తు చేశాడు. కేసీఆర్ భార్య శోభ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారన్నాడు. దీక్షకు గుర్తుగా ప్రపంచంలోనే అతి చిన్న రెండు చక్రాలతో హంస వాహనం తయారు చేశానని వివరించాడు.