Dr Raja Rao Interview : 'గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే.. ఎంసీహెచ్ కేంద్రాలు' - గాంధీ ఆస్పత్రిలో 8 అంతస్తుల్లో ఎంసీహెచ్ కేంద్రాలు
Gandhi Hospital Superintendent Dr. Raja Rao Interview : రాష్ట్రవ్యాప్తంగా మాతా శిశు ఆరోగ్యానికి పెద్దపీట వేయాలని నిర్ణయించిన సర్కారు.. ఈ మేరకు చర్యలు చేపట్టింది. నిమ్స్, గాంధీ లాంటి పెద్ద ఆస్పత్రుల్లో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఎంసీహెచ్ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే 8 అంతస్తుల్లో ప్రత్యేకంగా 200 పడకల ఎంసీహెచ్ కేంద్రం రూపుదిద్దుకోగా.. త్వరలోనే ఆస్పత్రిని ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. ఇప్పుడు వచ్చే కేంద్రంలో కేవలం డెలివరీలు మాత్రమే చేయనున్నారు. గాంధీ ఆస్పత్రిలో ప్రతి నెలా 600 డెలివరీలు అవుతాయి. సీరియస్‌గా ఉన్న కేసులను గాంధీ ఆస్పత్రులకు.. ఇతర ఆస్పత్రుల నుంచి తరలిస్తున్నారు. దీనివల్ల శిశు మరణాలు తగ్గుతున్నాయి. ఈ కొత్త ఆస్పత్రిలో అందించే సేవలు, గాంధీలో ఎంసీహెచ్‌తో పాటు.. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కేంద్రం, ఇన్ఫెర్టిలిటీ చికిత్సలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయన్న అంశాలపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.