తెలంగాణ

telangana

Massive fire breaks out at Kolkata Airport

ETV Bharat / videos

విమానాశ్రయంలో అగ్నిప్రమాదం.. భారీగా మంటలు! అరగంటలోనే అంతా.. - కోల్​కతా ఎయిర్​పోర్ట్ ఫైర్

By

Published : Jun 15, 2023, 8:49 AM IST

Kolkata airport fire : బంగాల్​లోని కోల్​కతా విమానాశ్రయంలో అగ్నిప్రమాదం చెలరేగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ ఎయిర్​పోర్ట్​లోని చెక్-ఇన్ ప్రాంతంలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి 9.12 గంటలకు పోర్టల్ డీ సమీపంలో మంటలు వచ్చాయని చెప్పారు. దీంతో వెంటనే చెక్-ఇన్ ప్రక్రియను నిలిపివేసినట్లు వెల్లడించారు. చుట్టూ పొగ కమ్ముకున్న నేపథ్యంలో విమానాశ్రయ సిబ్బంది, ప్రయాణికులను అక్కడి నుంచి సురక్షితంగా తరలించినట్లు సీఐఎస్ఎఫ్ వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపింది

ఘటన గురించి సమాచారం అందగానే వెంటనే అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. 28 నిమిషాల్లోనే మంటలు ఆర్పినట్లు తెలిపారు. రాత్రి 9.40 గంటల సమయానికి మంటలు అదుపులోకి వచ్చాయని స్పష్టం చేశారు. అనంతరం, చెక్-ఇన్ ప్రక్రియను పునరుద్ధరించినట్లు వివరించారు. ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'కోల్​కతా ఎయిర్​పోర్ట్ చెక్-ఇన్ కౌంటర్ సమీపంలో చిన్న అగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరం. ఎయిర్​పోర్ట్ డైరెక్టర్​తో మాట్లాడుతున్నా. పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. చెక్ ఇన్ ప్రక్రియ రాత్రి 10.25 గంటలకు పునఃప్రారంభమైంది. ప్రమాదానికి గల కారణాలను వెంటనే తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం' అని సింధియా స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details