తెలంగాణ

telangana

Massive fire Accident in CMR Shopping mall at Uppal

ETV Bharat / videos

ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్​లో భారీ అగ్నిప్రమాదం - తప్పిన ప్రాణ నష్టం - fire Accident Uppal CMR

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2024, 10:55 PM IST

Updated : Jan 3, 2024, 6:51 AM IST

Massive Fire Accident in CMR Shopping Mall at Uppal :హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న, సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి సమయంలో ఒక్కసారిగా నాలుగంతస్తుల భవనంలోని ముందు భాగంలో మంటలు చెలరేగాయి. క్రమంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో భవనం అగ్నికీలల్లో చిక్కుకుంది. 

Uppal CMR Shopping Mall Fire Accident : ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఘటనాస్థలానికి చేరుకుని మూడు గంటల పాటు ఐదు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. మంటల ధాటికి భవనంలోని పైకప్పు సీలింగ్‌ కుప్పకూలింది. అగ్నిప్రమాదం జరగడానికి కొద్ది సేపు క్రితమే అక్కడ పనిచేసే సిబ్బంది, మాల్‌ను మూసివేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మంటలు ఎగిసిపడడంతో పెద్ద ముప్పు తప్పింది.  

విద్యుద్ఘాతం కారణంగానే మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బట్టలకు సంబంధించిన మాల్‌ కావడంతో ప్రమాద తీవ్రత అధికమైంది. నాలుగంతస్తుల భవనంలో అగ్నిమాపక భద్రత ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయంపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత షాపింగ్‌ మాల్‌లో ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయంపై అధికారులు పరిశీలించి ఎవరు లేరని తెలుసుకున్నారు. ఘటనాస్థలాన్ని ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Jan 3, 2024, 6:51 AM IST

ABOUT THE AUTHOR

...view details