Margadarsi 109 Branch Opened in Kolar in Karnataka: "మార్గదర్శి సంస్థలో చిట్స్ వేయడం ఎంతగానో ఉపయుక్తం".. కోలార్‌లో మార్గదర్శి నూతన బ్రాంచ్ ప్రారంభం
Margadarsi 109 Branch Opened in Kolar in Karnataka: మార్గదర్శి సంస్థలో చిట్స్ వేయడం తమకు ఎంతగానో ఉపయుక్తంగా ఉందని.. ఖాతాదారులు స్పష్టం చేశారు. బ్యాంకులతో పోల్చితే సులభంగా తాము డబ్బును పొందుతున్నామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా తమకు ఆర్థిక అండగా నిలిచిందని కొనియాడారు. వేల కుటుంబాలు చిట్స్ కడుతున్నాయన్న ఖాతాదారులు.. డబ్బు తీసుకునేటప్పుడు తమకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని తేల్చిచెప్పారు. మార్గదర్శి సంస్థకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. మార్గదర్శి 109వ బ్రాంచిని కర్ణాటకలోని కోలార్ నూతనంగా ప్రారంభించారు. సంస్థ ఎండీ శైలజాకిరణ్(Margadarsi MD Sailaja Kiron) వర్చువల్‌గా ఈ బ్రాంచ్‌ను ప్రారంభించారు. కర్ణాటకలో మార్గదర్శి సంస్థకి ఇది 22వ బ్రాంచ్. ఈ కార్యక్రమంలో బ్రాంచి అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్గదర్శి సంస్థ 1962 అక్టోబర్‌లో కేవలం ఇద్దరు ఉద్యోగులతో మొదలై.. ప్రస్తుతం 5వేల మంది సిబ్బంది, 109 బ్రాంచ్‌లతో అగ్రగామి సంస్థగా రూపుదిద్దుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు.. తమిళనాడు, కర్ణాటకల్లోనూ మంచి పేరు సంపాదించుకుంది. వినియోగదారులే దేవుళ్లు అన్న నినాదంతో అన్ని వర్గాల ఆశలకు మార్గదర్శకత్వం చేసేలా ఉండాలన్న లక్ష్యంతో.. రామోజీరావు ఏర్పాటు చేసిన సంస్థ ఆరు దశాబ్దాలుగా దాదాపు 60 లక్షల మంది కస్టమర్లకు సేవలు అందించింది.
TAGGED:
Margadarsi 109 Branch Opened