తెలంగాణ

telangana

Maoist Trying to Stop Polling in Telangana

ETV Bharat / videos

ఎన్నికలు అపడానికి మావోయిస్టుల విఫలయత్నాలు - రెండు గ్రామాల మధ్య మందు పాతర - ఎన్నికలు నిలిపివేయలంటూ మావోయిస్టుల ప్రయత్నాలు

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2023, 2:51 PM IST

Maoist Trying to Stop Polling in Telangana : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చిన మావోయిస్టులు..  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఓటర్లను భయపెట్టే చర్యలకు దిగారు. దుమ్ముగూడెం, చర్ల, వాజేడు వెంకటాపురం మండలాల్లో ఓటర్లు ఏజెన్సీ ప్రాంతంలోని అటవీ గ్రామాల నుంచి తరలివచ్చి ఓట్లు వేస్తున్న సమయంలో మావోయిస్టులు ఓ మందుపాతర అమర్చారు.  

చర్ల మండలంలోని చినముడిసిలేరు బి,కొత్తూరు గ్రామాల మధ్యలో ఉన్న కల్వర్ట్ వద్ద ఈ మందు పాతర అమర్చారు. మందు పాతరను గుర్తించిన పోలీసులు  వెలికితీసేందుకు బాంబ్ స్కాడ్, డాగ్ బృందాలను రంగంలోకి దింపి బాంబు నిర్వీర్యం చేసేందు ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టులు బాంబు ఏర్పాటు చేసిన రహదారి గుండా ఓటర్లను పోనీయకుండా జాగ్రత్తలు చేపట్టారు. అంజనాపురం చిన్న మెడిసిలేరు ఓటర్లను కాలువ గట్టు వెంట పెద్ద మీడిసిలేరు పోలింగ్ బూత్​కు తరలించారు. మధ్యాహ్నం 1గంటల వరకు భద్రాచలం నియోజకవర్గం జిల్లాలో అధికంగా 47.5 శాతం పోలింగ్ నమోదైంది.  

ABOUT THE AUTHOR

...view details