Manda Krishna Madiga Fires on Revanthreddy : "ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌పార్టీకి, రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదు" - Hyderabad Latest News
Manda Krishna Madiga on SC Classification Bill : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. కులతత్వవాది, అహంకారి అని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీకి గానీ, రేవంత్‌రెడ్డి గానీ చిత్తశుద్ది లేదన్నారు. వర్గీకరణపై చిత్తశుద్ది ఉంటే పదేళ్లు కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. అవసరాల కోసం పార్టీలు మారే రేవంత్‌రెడ్డికి.. ఎంఆర్‌పీఎస్ ఉద్యమం గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే.. రేవంత్‌రెడ్డి పార్టీ మారతారని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పగలవా అని సవాల్ చేశారు. మాదిగల సహకారంతోనే ఈ స్థాయికి వచ్చానని చెప్పుకునే రేవంత్‌రెడ్డి.. దళితులకు చేసిన ప్రయోజనాలు ఏమిటో చెప్పాలన్నారు. మాదిగల సాయంతో ఎదిగిన రేవంత్.. మాదిగల ఉద్యమాన్ని అవమానిస్తారా అని నిలదీశారు. మాదిగల పట్ల తనకున్న కృతజ్ఞత ఇదేనా అని ప్రశ్నించారు.