Manchu family visit Yadadri: యాదాద్రీశుని దర్శించుకున్న మంచు కుటుంబం - యాదాద్రి తాజావార్తలు
Manchu family visit to Yadadri: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని మంచు మనోజ్, మంచు లక్ష్మి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. యాదాద్రి నరసింహ స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాని మంచు మనోజ్ అన్నారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మంచు మనోజ్ దంపతులను గుడికి తీసుకొస్తానని మొక్కుకున్నానని.. ఇప్పడు మొక్కు చెల్లించుకున్నానని మంచు లక్ష్మీ తెలిపారు. అంతకు ముందు టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థలో భాగంగా మంచు లక్ష్మి తన సోదరుడు మంచు మనోజ్‌తో కలిసి యాదాద్రి జిల్లా కలెక్టర్‌ని కలిశారు. సంస్థకు సంబంధించిన అంశాలపైన చర్చించారు. తమ టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాల్లో భాగంగా 56 స్కూళ్లలో 3000 మందికి పైగా విద్యార్థులకు చదువు చెప్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ సంస్థ ద్వారా ఇంకా లక్షలాది మంది విద్యార్థులు చదువుకునేలా కృషి చేస్తామన్నారు.