తెలంగాణ

telangana

Manchireddy Kishan Reddy vs Malreddy Ranga Reddy

ETV Bharat / videos

మంచిరెడ్డి కిషన్​రెడ్డి వర్సెస్​ మల్​రెడ్డి రంగారెడ్డి - ఇబ్రహీంపట్నం నీదా నాదా 'సై' - telangana assembly election 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 6:57 AM IST

Manchireddy Kishan Reddy vs Malreddy Ranga Reddy : రాష్ట్ర అసెంబ్లీ సమరంలో హోరాహోరీగా పోరాడే అతి కొద్ది నియోజకవర్గాల్లో ఇబ్రహీంపట్నం అగ్రస్థానంలో ఉంటుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంచిరెడ్డి కిషన్‌ రెడ్డితో మరోసారి హోరాహోరీ పోరుకు కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగుతున్న మల‌్ రెడ్డి రంగారెడ్డి సిద్ధమయ్యారు. వీరిరువురిలో గెలుపెవరిది.. 119 నియోజకవర్గాల్లో ఇబ్రహీంపట్నం ఎన్నిక అంటే ఎందుకు అంత ప్రాముఖ్యత.

Telangana Election Fight 2023 : అభివృద్ధి, సంక్షేమమే కాకుండా యువతకు ఉద్యోగ కల్పన ధ్యేయమని మంచిరెడ్డి చెబుతున్నారు. పేద ప్రజలకు అండగా తను చేసిన పోరాటాలే గెలిపిస్తాయని మల్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రజలు నమ్మే అవకాశం లేదని చెబుతుండగా.. పేదల వ్యతిరేకిగా ఉన్న మంచిరెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమని మల్ రెడ్డి రంగారెడ్డి విశ్వాసంతో ఉన్నారు. విజయంపై ఎవరికి వారే ధీమా ఉన్న మంచిరెడ్డి, మల్‌రెడ్డి ఓటర్లు పట్టం కడతారని చెబుతున్నారు. వీరి సై ఆటలో నియోజకవర్గ ప్రజలు ఎటువైపు అడుగులు వేస్తారో డిసెంబరు 3 వరకు వేచి ఉండక తప్పదు మరీ.

ABOUT THE AUTHOR

...view details