Prathidwani : అధ్వానంగా మారిన ప్రభుత్వ బడుల పరిస్థితి.. కారణమేంటి?
Mana ooru- Mana Badi Scheme in Telangana : ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల్లో ఎక్కడున్నాం..? కొద్దిరోజులుగా అందర్నీ వేధిస్తున్న ప్రశ్న ఇది. రాష్ట్రంలోని.. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పన లక్ష్యంతో చేపట్టిన మనఊరు- మనబడి పథకం అనుకున్నంత వేగంగా సాగక పోవడమే అందుకు కారణం. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 16 నెలలు దాటినా.. ఇప్పటివరకు 15.78% పాఠశాలల్లోనే పనులన్నీ జరిగాయి. 9,144 పాఠశాలల్లో పనులు పూర్తయినవి 1,443 మాత్రమే. తొలి విడతకు అంచనా వ్యయం రూ.3,497 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేసింది రూ.940 కోట్లే. నిధుల కొరత, పర్యవేక్షణ లోపంతో మిగిలిన చోట్ల అసంపూర్తి పనులు ఎన్నోవిధాల సవాల్ విసురుతున్నాయి. 3 దశల్లో మూడేళ్లలో పనులు పూర్తిచేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. వర్షాకాలం కావడంతో ఇబ్బందులు మరికాస్త ఎక్కువున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విద్యావేత్తల సూచనలు ఇస్తున్నారు. అసలు రాష్ట్రంలో 30 వేలకు పైగా ఉన్న సర్కారీ బడుల్లో ఎన్నింట్లో ప్రమాణాల మేరకు వసతులున్నాయి? తక్షణం చేపట్టాల్సిన చర్యలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.