తెలంగాణ

telangana

Man took Snake To Hospital

ETV Bharat / videos

కాటేసిన పాముతో ఆస్పత్రికి- ఇంజెక్షన్​ చేయండంటూ హాస్పిటల్​లో హల్​చల్​! - Man took Snake To Hospital

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 5:30 PM IST

Updated : Nov 21, 2023, 6:06 PM IST

Man took Snake To Hospital Viral Video : కాటువేసిన నాగుపామును ఆసుపత్రికి తీసుకువచ్చి హల్​చల్ చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మీర్జాపుర్​లో జరిగింది. లాల్​గంజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని పతుల్ఖీ గ్రామానికి చెందిన సూరజ్​ అనే యువకుడుని తన ఇంటివద్ద సోమవారం సాయంత్రం పాముకాటు వేసింది. సూరజ్​ భయపడకుండా తనను కాటువేసిన పామును సంచిలో బంధించారు. చికిత్స కోసం వెంటనే దగ్గర్లోని మీర్జాపుర్​ ప్రభుత్వ ఆసుపత్రికి బైక్​పై వెళ్లాడు. 

ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు చేరుకుని తాను పాముకాటుకు గురయ్యానని వెంటనే ఇంజక్షన్​ ఇవ్వాలని వైద్యులను కోరాడు. సూటు, బూటులో వెళ్లిన సూరజ్​ను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఏ పాము కాటువేసిందో చెప్పాలని.. ఆ తర్వాతే ఇంజక్షన్ ఇస్తామని సూరజ్​ను వైద్యులు కోరారు. తన వెంట తెచ్చిన పామును సంచిలోనుంచి తీసి ఎమర్జెన్సీ వార్డు బెడ్​పై ఉంచాడు సూరజ్​. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వైద్యులు ఆసుపత్రి సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే పామును సంచిలో ఉంచాలని వారంతా కోరారు. దీంతో సూరజ్​ మళ్లీ పామును పట్టుకుని సంచిలో బంధించాడు. తనను ఏ పాము కాటువేసిందో వైద్యులు గుర్తించేందుకే దానిని ఆసుపత్రికి తీసుకువచ్చింది. అనంతరం సూరజ్​కు వైద్యులు యాంటీవీనమ్​ ఇంజక్షన్ ఇచ్చారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పామును సూరజ్​ తొలగించి పట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. 

Last Updated : Nov 21, 2023, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details