చేతులతో నాలుగు బుల్లెట్లను ఆపిన యువకుడు.. పళ్లతో కారును లాగిన వ్యక్తి - punjab car pulling
పంజాబ్ లూధియానా జిల్లాలోని ఖిలా రాయ్‌పుర్‌లో జరుగుతున్న గ్రామీణ క్రీడాపోటీల్లో యువకులు సత్తా చాటుతున్నారు. సాహసాలు చేస్తూ అదరగొడుతున్నారు. ఈ సందర్భంగా లవ్‌దీప్ సింగ్ అనే వ్యక్తి.. బుల్లెట్ బైక్‌లకు తాళ్లు కట్టి వాటిని ముందుకు పోకుండా ఆపి ఔరా అనిపించాడు. తనకు ఇరువైపులా రెండు బైక్‌లను ఉంచి వాటికి తాళ్లు కట్టిన లవ్‌దీప్.. ద్విచక్రవాహనాలను స్టార్ట్ చేయాలని యువకులకు సూచించాడు. వారు గేర్ వేసి బైక్ రేస్ చేసినప్పటికీ.. బుల్లెట్లు ముందుకు కదలలేదు. సన్నని తాళ్ల ఆసరాతోనే బైక్‌లను ముందుకు పోనీయకుండా నిలువరించాడు లవ్‌దీప్. గతకొన్ని సంవత్సరాలుగా ఈ క్రీడల్లో పాల్గొంటున్నట్లు చెప్పాడు 24 ఏళ్ల లవ్‌దీప్. ఇప్పటివరకు జిమ్‌కు వెళ్లలేదని, స్థానికంగా దొరికే ఆహారాన్నే తింటానని చెబుతున్నాడు.
మరోవైపు, ఇదే క్రీడల్లో ఫరీద్కోట్ జిల్లాకు చెందిన జగ్దీప్ సింగ్ అనే 36ఏళ్ల వ్యక్తి.. పళ్లతో ఏకంగా కారునే లాగేశాడు. ప్రయాణికుల బరువుతో కలిపి 500 కిలోలు ఉన్న మారుతీ కారుకు తాడు కట్టి కొద్దిదూరం వరకు లాక్కెళ్లాడు. జగ్దీప్ సాహసాన్ని చూసి వీక్షకులు చప్పట్లతో అభినందించారు. గత పదేళ్లుగా ఇలాంటి సాహసాలు చేస్తున్నానని జగ్దీప్ తెలిపాడు. యువత డ్రగ్స్‌కు బానిస కాకూడదని, మంచి ఆహారం తినాలని సలహా ఇస్తున్నాడు.