సచివాలయం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం - బాపు మోకాషి ఆత్మహత్యాయత్నం మహారాష్ట్ర
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి కార్యాలయం పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అదృష్టవశాత్తు రెండవ అంతస్తులో ఏర్పాటు చేసిన సేఫ్టీ నెట్లో చిక్కుకుని గాయాలతో బయటపడ్డాడు. బీడ్ జిల్లాకు చెందిన బాపు మోకాషి అనే 43 ఏళ్ల వ్యక్తి గురువారం ముంబయిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుండగా 6వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. మూడు సంవత్సరాల క్రితం తన ప్రేయసిపై దాడి జరిగిన కేసులో తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యకు యత్నించాడు. నిందితులను శిక్షించాలని కోరుతూ గత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు నాలుగు సార్లు లేఖ రాసినా సరే స్పందన లేదని వాపోయాడు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST