ఇదేందయ్యా ఇది.. ఎద్దును పెళ్లాడిన యువకుడు - Man married to an Ox in Anakapalle
Man married to an Ox video viral : ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ వింత పెళ్లి ప్రస్తుతం వైరల్‌గా మారింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం జాలంపల్లిలో తోడుపెద్దు(ఎద్దు)తో ఓ యువకుడికి వివాహం చేశారు. ఇంటి ముందు పెద్ద పందిరి వేసి, బంధు మిత్రులను పిలిపించి అంగరంగ వైభవంగా నిఖా జరిపించారు.
వేడుక అనంతరం వచ్చిన వారికి విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు. ఈ వింత పెళ్లిని చూసేందుకు గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారూ తరలివచ్చారు. ఈ తంతును చూసి ఎద్దుతో పెళ్లేంటి అని కొందరు అడగగా.. ఇది తమ ఆచారమని.. తమ పూర్వీకుల నుంచి వస్తుందని స్వయానా పెళ్లి కుమారుడు చెప్పిన మాటలతో ముక్కున వేలేసుకున్నారు.
anakapalle strange marriage viral video: ఈ వింత ఆచారంపై యాదవ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ గ్రామంలో సంక్రాంతి సమయంలో తోడపెద్దును ఊరేగించే ఆచారం పూర్వీకుల నుంచి ఉంది. అయితే కొన్నాళ్ల క్రితం ఈ తోడపెద్దు చనిపోయింది. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం భోగి పండుగ రోజున మురుకుతి రామనాయుడు ఇంట్లో ఓ దూడ జన్మించింది. దానిని సింహాద్రి అప్పన్న పుట్టుకగా భావించి.. దూడకు మూడేళ్ల వయసు వచ్చిన తర్వాత ఆ ఇంట్లోని పెళ్లి కాని యువకుడు నాయుడుతో సంప్రదాయబద్ధంగా పెళ్లి తంతు నిర్వహించారు. అనంతరం నూతన వధూవరులకు ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. మొత్తానికి సాధారణ వివాహానికి ఏమాత్రం తగ్గకుండా.. కల్యాణ క్రతువును కానిచ్చారు.
అయితే ఎద్దుతో పెళ్లి అయినప్పటికీ వివాహ వయస్సు వచ్చిన తర్వాత ఆ యువకుడు మళ్లీ వేరే యువతిని తన ఇల్లాలిగా చేసుకోవచ్చని యాదవ పెద్దలు తెలిపారు. ఏదేమైనా ఎద్దుతో యువకుడి పెళ్లి ఏంట్రా బాబు అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈరోజుల్లోనూ ఇలాంటి వింత ఆచారాలు పాటించడమేంటని తమ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి..
మొన్న మరియమ్మ.. నేడు ఖదీర్ ఖాన్.. పోలీసుల థర్డ్ డిగ్రీతో బలవుతున్న అమాయకులు
రంగారెడ్డి జిల్లాలో దారుణం.. కిడ్నాప్ చేసి కారులోనే వివాహితపై రేప్