కుమార్తె పుట్టినరోజున లక్ష పానీపూరీలు పంచిన వ్యాపారి - పానీపూరీ పంపిణీ
మధ్యప్రదేశ్ భోపాల్‌లోని కోలార్‌కు చెందిన ఓ పానీపూరీ వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. ఆంచల్ గుప్తా అనే వ్యాపారి తన కుమార్తె మొదటి పుట్టిన రోజు సందర్భంగా 1.01 లక్షల పానీపూరీలను ఉచితంగా పంపిణీ చేశాడు. ఆడపిల్లలను చదువులో ప్రోత్సహించేందుకే ఖర్చుకు వెనకాడలేదని తెలిపాడు. 'బేటీ బచావో బేటీ పడావో' కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకే ఇలా చేశానని ఆంచల్ చెబుతున్నాడు. కాగా, ఆంచల్ గుప్తాపై ప్రశంసలు కురిపించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఈ పానీపూరీ పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ హాజరయ్యారు.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST