Young Man Dies With Fits Mancherial Video Viral : మహిళను వేధించాడని అరెస్టు.. ఠాణాలో ఫిట్స్‌తో యువకుడి మృతి.. వీడియో వైరల్ - మంచిర్యాల తాజా నేర వార్తలు
Published : Aug 28, 2023, 1:02 PM IST
|Updated : Aug 28, 2023, 4:48 PM IST
Young Man Dies With Fits Mancherial Video Viral :మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఓ యువకుడు ఫిట్స్‌తో మృతి చెందడం కలకలం రేపింది. ఓ మహిళను వేధిస్తున్నాడనే కేసులో పోలీసులు అతడిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. స్టేషన్లో కుర్చీలో కూర్చొన్న ఆ యువకుడు మొబైల్ ఫోన్‌తో ఆడుతూ.. అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి కుప్పకూలాడు.
Young Man Dies With Fits Mancherial Police Station :బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన అంజి.. ఓ మహిళను వేధిస్తున్నాడనే సమాచారం వచ్చింది. పోలీసులు అతడ్ని ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ ఆవరణలోని కుర్చీలో కూర్చోబెట్టారు. అంజి మొబైల్ చూస్తుండగా ఫిట్స్ వచ్చి ఒక్కసారిగా కింద పడిపోయాడు. గమనించిన పోలీసులు యువకుడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యలోనే అతడు మృతి చెందాడు. పోలీసులు అంజి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అంజికి ఫిట్స్ వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ యువకుడు ఫిట్స్‌తోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని రెండో పట్టణ ఎస్సై రవికుమార్ స్పష్టం చేశారు.
అయితే మృతుడి సోదరుడు ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులే తన సోదరుడి మృతికి బాధ్యత వహించాలని అన్నారు. ఇంతకు ముందు ఫిట్స్ ఎప్పుడు రాలేదని ఇప్పుడు ఎలా ఫిట్స్‌తో చనిపోతాడని ప్రశ్నించాడు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు.