గణేశ్ వేడుకలో విషాదం.. అప్పటివరకు హుషారుగా డ్యాన్స్.. ఒక్కసారిగా కుప్పకూలి.. - గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి
ఉత్తర్‌ప్రదేశ్ మెయిన్‌పురి సమీపంలోని కొత్వాలి ప్రాంతంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో విషాదం నెలకొంది. హనుమంతుడి వేషదారణలో హుషారుగా డ్యాన్స్ చేస్తూ ఉన్న రవి శర్మ(35) అనే వ్యక్తి హఠాత్తుగా గుండె పోటుతో కుప్పకూలి.. ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అప్పటివరకు ఎంతో హుషారుగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేసిన వ్యక్తి మండపంలోనే ప్రాణాలు కోల్పోవడం వల్ల భక్తులు షాక్‌కు గురయ్యారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST