దూసుకొచ్చిన ఏనుగులు.. చెట్టుపైకి ఎక్కిన రైతు.. గంటన్నర అక్కడే.. చివరికి.. - ఏనుగుల గుంపు హల్చల్
కేరళ ఇడుక్కిలో ఏనుగులు హల్చల్ చేశాయి. సింగుకండానికి చెందిన సాజి అనే రైతు.. పొలంలో పనిచేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గజరాజుల మంద అతనిపైకి దూసుకొచ్చింది. దీంతో అతడు సమీపంలో ఉన్న చెట్టుపైకి ఎక్కేశాడు. గంటన్నరపాటు ఏనుగుల గుంపు నుంచి తప్పించుకునేందుకు చెట్టుపైనే ఉండిపోయాడు. అనంతరం సహాయం కోసం కేకలు వేయగా.. కొంతమంది స్థానికులు అక్కడికి చేరుకుని అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ అధికారులు మందుగుండు సామగ్రిని పేల్చగా.. ఏనుగుల గుంపు అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST