తెలంగాణ

telangana

Malreddy Ranga Reddy

ETV Bharat / videos

'తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌ని గద్దె దించడానికి సిద్ధమయ్యారు' - తెలంగాణలో ఎన్నికల ప్రచారం 2023

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2023, 1:36 PM IST

Malreddy Ranga Reddy Election Campaign in Ibrahimpatnam : కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ అని ఆ పార్టీ ఇబ్రహీంపట్నం అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీలో తట్టి అన్నారం, వైఎస్సార్ కాలనీ, మర్రిపల్లిలో మల్‌రెడ్డి రంగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ దేవిడి గీతా వేణుగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ కార్యకర్తలు, సీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. గత 10 ఏళ్లుగా నియోజకవర్గంలో బీఆర్ఎస్‌తో అభివృద్ధి వెనుకబడిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలందరూ ఐక్యమై బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడానికి సిద్ధమయ్యారని అన్నారు. 

Congress Candidate Election Campaign in Ibrahimpatnam :కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మల్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే పేదింటి అమ్మాయి పెళ్లికి రూ.లక్ష తులం బంగారం ఇవ్వబోతున్నామన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే అభివృద్ధి పనులు కొనసాగుతాయని మల్‌రెడ్డి రంగారెడ్డి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details