తెలంగాణ

telangana

మల్లన్న స్వామి బోనాల జాతర

ETV Bharat / videos

హోలీ తరువాత ఆదివారం.. ఈ మల్లన్నకు ప్రత్యేకం.. - Cultural heritage of Telangana

By

Published : Mar 12, 2023, 7:04 PM IST

Mallanna Swami Bonala Jatara at Peddapur in MetPalli: జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం పెద్దాపూర్​లో మల్లన్న స్వామి బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగింది. ప్రతి సంవత్సరం హోలీ పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున మల్లన్న స్వామి బోనాల జాతరను నిర్వహిస్తుంటారు. బోనాల జాతర కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సుమారు 30 వేల మందికి పైగా బోనాలను స్వామి వారికి సమర్పించారు. 

భక్తులు రోజంతా ఉపవాసంతో ఉండి సాయంత్రం సమయంలో తలస్నానం చేసి నూతన దుస్తులు ధరించి బోనాలను నెత్తిన ఎత్తుకొని భక్తులు మల్లన్న స్వామి ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తారు. అనంతరం స్వామి వారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. సుమారు గంట పాటు జరిగే ఈ బోనాల వేడుకను తిలకించేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లను చేశారు. ఈ వేడుకకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి మూడు రోజుల పాటు ఈ వేడుకల్లో పాల్గొంటారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details