Actress Samyukta in Hyderabad : నగల షోరూం ప్రారంభోత్సవంలో నటి సంయుక్త సందడి - Malayalam Actress Samyuktha IN hyderabad
Actress Samyukta opened a jewelery shop in Hyderabad : మిలమిల మెరిసే చీరకట్టులో మలయాళీ నటి సంయుక్త హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మెరిశారు. పంజాగుట్టలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ జ్యువెల్లరీ షోరూం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సినీ కథానాయిక సంయుక్తతో పాటు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానిక బీఆర్ఎస్ నేతలు, జ్యువెెల్లరీ సీఈవో, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన విరూపాక్ష చిత్రం ఘన విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని సంయుక్త అన్నారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపుతున్న అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. హైదరాబాద్ అంటే ప్రత్యేక అభిమానం ఏర్పడిందన్నారు. తేలిక పాటి ఆభరణాలతో పాటు మంచి డిజైన్ వజ్రాభరణాలను ఎక్కువగా ఇష్టపడతానని చెప్పారు.
ఒకప్పటి హైదరాబాద్‌కు.. ఇప్పటి హైదరాబాద్‌కు చాలా తేడా ఉందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ప్రస్తుతం భాగ్యనగరం గ్లోబల్ సిటీగా మారిపోతోందని తెలిపారు. ఇక్కడ అన్ని వర్గాల వారు, అన్ని భాషల వారు, విభిన్న సంస్కృతులకు నిలయంగా మారిందన్నారు. విద్య, వైద్య, వ్యాపారం, ఐటీ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల తీరుగా సాగుతూ.. దేశానికే అదర్శంగా నిలిస్తోందని వివరించారు.