తెలంగాణ

telangana

ETV Bharat / videos

తుపాకీతో బెదిరిస్తున్న దొంగ సంగతి తేల్చిన మంత్రి - మహారాష్ట్ర మాలేగావ్ న్యూస్

By

Published : Oct 25, 2022, 12:55 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

మహారాష్ట్ర మంత్రి దాదా భూసే సాహసం చేశారు. ఓ బంగ్లాలో మహిళలను తుపాకీతో బెదిరించి చోరీకి యత్నించిన దొంగను ఆయన పట్టుకున్నారు. ఈ ఘటన మాలెగావ్​ పట్టణంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. తుపాకీతో బంగ్లాలో ఉన్న మహిళలను బెదిరించి నగదు నగలు ఇవ్వాలని దొంగ డిమాండ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి దాదా భూసే దొంగను లొంగిపోవాలని కోరారు. ఎంతసేపటికీ దొంగ పట్టించుకోకపోవడం వల్ల బంగ్లాలోకి పార్టీ కార్యకర్తలతో కలిసి వెళ్లి దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details