గుర్రాలపై వచ్చి కలెక్టర్ ఆఫీసు ముందు పెళ్లికాని ప్రసాదుల వింత నిరసన
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో యువకులు వింత నిరసన చేశారు. వివాహం చేసుకోవటానికి రాష్ట్రంలో తగిన సంఖ్యలో అమ్మాయిలు పెళ్లికాని యువకులు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. క్రాంతి జ్యోతి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనకు పెళ్లికాని యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గుర్రాలపై ఊరేగితూ సోలాపూర్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు సరిపడా మహిళల సంఖ్య లేదని యువకులు అంటున్నారు. సోలాపూర్‌లోనూ ఇదే పరిస్థితి ఉందని క్రాంతి జ్యోతి పరిషత్ ఛైర్మన్ రమేశ్ బార్స్కర్ తెలిపారు. దీంతో సోలాపూర్‌లో అబ్బాయిలు పెళ్లి చేసుకోవటానికి అమ్మాయిలు దొరకటం లేదని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చదువుకొని ఉన్నతమైన స్థానాల్లో ఉన్నా తమకు పెళ్లిళ్లు కావడం లేదని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కేరళ రాష్ట్రంలో అబ్బయిల కంటే అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉందని యువకులు చెబుతున్నారు. మహారాష్ట్రలో లింగ నిష్పత్తి సమానంగా లేకపోవడానికి లింగనిర్ధరణ చట్టం పటిష్ఠంగా అమలు కాకపోవటమే అని వారు ఆరోపించారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST