తెలంగాణ

telangana

traffic-police-dragged-on-car-bonnet

ETV Bharat / videos

కారు బానెట్​పై పోలీసును 20 కిలోమీటర్లు లాక్కెళ్లిన డ్రైవర్ - నవీ ముంబయి కారు బానెట్​పై పోలీసు

By

Published : Apr 16, 2023, 12:38 PM IST

ట్రాఫిక్ పోలీసును కారు బానెట్​పై 20 కిలోమీటర్ల వరకు లాక్కెళ్లాడు ఓ వ్యక్తి. మహారాష్ట్ర నవీ ముంబయిలో శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ సేవించారన్న అనుమానంతో వాశీ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు కారును అడ్డగించే ప్రయత్నం చేశారు.

కోపర్​ఖెరాణె-వాశీ మార్గంలో బందోబస్తు నిర్వహిస్తున్న సిద్ధేశ్వర్ మాలి(37) అనే ట్రాఫిక్ పోలీసు.. మరో పోలీసుతో కలిసి కారును అడ్డుకున్నారు. ఆ కారు డ్రైవర్ డ్రగ్స్ తీసుకున్నారనే అనుమానంతో వారిని ఆపారు. పోలీసులు తనిఖీ చేస్తుండగా.. కారు డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. ముందున్న సిద్ధేశ్వర్ మాలి కారు బానెట్​పై పడిపోయారు. డ్రైవర్ మాత్రం కారును ఆపకుండా అలాగే వేగంగా పోనిచ్చాడు. కారును గట్టిగా పట్టుకొని ఉన్న ట్రాఫిక్ పోలీసు.. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవ్హాన్ ఫాటా ప్రాంతానికి చేరుకున్న తర్వాత కింద పడిపోయారు. ఇతర పోలీసులు ఆ కారును వెంబడించి.. డ్రైవర్​ను పట్టుకున్నారు. నిందితుడిని 22 ఏళ్ల ఆదిత్య బెంబ్డేగా గుర్తించారు. అతడు డ్రగ్స్ సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు తెలిపారు. అతడిపై మూడు ఐపీసీ సెక్షన్లు సహా మాదకద్రవ్యాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details