శిర్డీ సాయి ఆలయానికి సరికొత్త భద్రత వ్యవస్థ.. 750 మందితో ఫుల్ సెక్యూరిటీ - మాహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ భద్రత శిర్డీ ఆలయం
Shirdi Security : శిర్డీ ఆలయ భద్రతను ఇక నుంచి మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్-MSF చేపట్టనుంది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో.. MSF సెక్యూరిటీ ఏజెన్సీతో ఒప్పందం కుదిరినట్లు సాయిబాబా సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శివశంకర్ తెలిపారు. ఒప్పందంలో భాగంగా 74 మంది సాయుధ జవాన్లు శిర్డీ ఆలయ భద్రతను చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్లలో భక్తులను తనిఖీ చేయడం, ఆలయం వెలుపల కూడా MSF సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహించనున్నారు. వీరికి అదనంగా మరో 100 మంది జిల్లా పోలీసులు ఆలయ భద్రతను చూస్తారని శివశంకర్ తెలిపారు తెలిపారు. వీరితో కలిసి మొత్తం 750 మందికి పైగా సిబ్బంది భద్రత చేపడుతున్నట్లు సాయి సంస్థాన్ సీఈఓ తెలిపారు.
Shirdi Security Issue : సాయి మందిరానికి CISF భద్రత కల్పించాలన్న నిర్ణయంపై దాఖలైన పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ అనుమతి మేరకు ఈ ఒప్పందం జరిగినట్లు సాయి సంస్థాన్ ట్రస్ట్ సీఈవో వెల్లడించారు. మరోవైపు, శిర్డీ సాయిబాబా సంస్థాన్ తరఫున గురుపూర్ణిమ ఉత్సవాలను 2023 2 జులై నుంచి జులై 4 వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.