Mahabubabad Farmer Plows Chilli Crop : గుండెల నిండా బాధతో.. కన్నీరుమున్నీరవుతూ.. మిర్చి తోటను తొలగించిన రైతు - మిర్చి పంటను దున్నేసిన మహబూబాబాద్ రైతు
Published : Oct 18, 2023, 10:32 AM IST
Mahabubabad Farmer Plows Chilli Crop : మిర్చి రైతులకు సాగు కష్టాలు తప్పడం లేదు. కొండంత ఆశతో ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులను బొబ్బ తెగులు బెంబేలెత్తిస్తోంది. ఎన్ని మందులు పిచికారీ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరకు తోటలను తొలగించుకోవాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Chilli Farmers Problems in Telangana :మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ గ్రామానికి చెందిన రైతు దుస్స వెంకన్న రెండున్నర నెలల క్రితం మూడు ఎకరాల్లో రూ.2 లక్షల పెట్టుబడితో మిర్చి సాగు చేశారు. పంటకు బొబ్బ తెగులు సోకడంతో మొక్కల ఎదుగుదల నిలిచిపోయింది. తెగులు నియంత్రణకు అవసరమైన మందులు పిచికారీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు నల్ల తామర సోకడంతో పంట అంతా కళ్ల ముందే పనికిరాకుండా పోయింది. చేసేదేం లేక వెంకన్న తన పంటను తొలగించాలని నిర్ణయించుకున్నారు. ట్రాక్టర్‌తో మిర్చి తోటను పూర్తిగా దున్నేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తమకు అండగా నిలుస్తుందని భావించిన మిర్చి రైతులకు బొబ్బ తెగులు రూపంలో నష్టాలు వాటిల్లుతుండటంతో వారు కన్నీటిపర్యంతమయ్యారు.
MirchiFarmers Problems in Telangana :మరోవైపు తెల్ల దోమతో బొబ్బ వైరస్ సోకుతోందని దీని నివారణకు ఎకరాకు 30 నుంచి 35 పసుపు జిగురు అట్టాలు ఏర్పాటు చేసుకోవాలని మల్యాల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లీడర్ నేటికిథ యోమితక్షమ్, లేదా ఎసిటమీ ప్రిడ్ ను నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే జీవులను అరికట్టవచ్చని సూచిస్తున్నారు. మిర్చి రైతులు ఈ విషయాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకుని పంటను కాపాడుకోవాలని చెప్పారు.