Selfie Suicide In Hanamkonda : 'నా లవర్, ఆమె ఫ్రెండ్ వేధింపుల వల్లే చనిపోతున్నా' - సెల్ఫీ సూసైడ్
Youngman Selfie Suicide In Hanamkonda : తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని.. ఆ బాధను తట్టుకోలేకపోతున్నానంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన మండ సాయిచరణ్(24) అనే యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందంటూ సెల్ఫీ వీడియో తీసుకుని.. ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రేమించిన అమ్మాయి, ఆమె స్నేహితుడు కలిసి గత 4 నెలలుగా తనను మానసికంగా, శారీరకంగా హింసించడం వల్లే ప్రాణాలు తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఆమె ప్రతి బర్త్‌డే రోజున తన చావు గుర్తుకురావాలని.. అందుకోసమే ఇన్ని రోజులు ఆగానని చెప్పాడు. ప్రియురాలి పుట్టినరోజున అర్ధరాత్రి ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం చనిపోతున్నట్లు పేర్కొన్నాడు. అక్క, బావ, అమ్మ, నాన్న, స్నేహితులందరూ క్షమించండి అంటూ వీడియోలో తెలుపుతూ ఫ్యాన్‌కు ఉరేసుకొని తనువు చాలించాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.