తెలంగాణ

telangana

lorry

ETV Bharat / videos

ఈ డ్రైవర్​ మామూలోడు కాదు.. పోలీసులకే చుక్కలు చూపించాడుగా! - latest viral videos

By

Published : Mar 20, 2023, 10:06 AM IST

Lorry Driver Jumped Into The Canal: ఆంధ్రప్రదేశ్ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో ఆదివారం విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వెంకటాచలం మండలం ఇడిమేపల్లికి చెందిన చల్లా కృష్ణ వింజమూరుకు టిప్పర్‌ తీసుకెళ్తూ ఉండగా.... పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలో వేగంగా వెళ్తూ ఆటోను ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా సంగం వైపు వేగంగా వస్తూ గేదెనూ ఢీకొన్నాడు. ఇది చూసిన గ్రామస్థులు ఆ వాహనాన్ని ఆపాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

రంగంలోకి దిగిన పోలీసులు టిప్పర్​ వాహనంలో వెళ్తున్న డ్రైవర్​ను వెంబడించారు. ఈ క్రమంలో టిప్పర్.. బెజవాడ పాపిరెడ్డి కాలువ వైపు వెళ్తుండగా అదుపుతప్పింది. పోలీసులకు దొరికితే తన పని అయిపోయినట్టేనని భావించిన డ్రైవర్.. కనిగిరి జలాశయం ప్రధాన కాలువ గట్టుపై ఆగాడు. పోలీసులు సమీపిస్తున్నారని గ్రహించి ఒక్క ఉదుటున కనిగిరి జలాశయం కాలువలో దూకాడు. అక్కడికి వచ్చిన పోలీసులకు డ్రైవర్.. కాలువలో ఈదుతూ వెళుతున్నట్లు కనిపించాడు. 

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువలో ఈదడం ప్రమాదమంటూ ఎస్సై కె.నాగార్జునరెడ్డి అక్కడికి వెళ్లి అతనికి చెప్పాడు.  దీంతో మరింత భయపడిన అతడు వేగంగా ఈదుతూ... కాలువలో ఒక చోట చెట్లను పట్టుకుని కాసేపు అక్కడే ఉన్నాడు. అక్కడే బెండు ముక్క దొరకడంతో దాని ఊతంగా తిరిగి ఈత స్టార్ట్ చేశాడు. లాభం లేదని సంగంలోని గజ ఈతగాళ్లను పోలీసులు రంగంలోకి దించగా... గజ ఈతగాళ్లు  కృష్ణను గట్టుకు తెచ్చారు.

ABOUT THE AUTHOR

...view details