తెలంగాణ

telangana

goat

ETV Bharat / videos

Viral Video: మేక తలకాయల లోడ్​ రోడ్డుపై పడిపోయింది.. ఇంకేముంది క్షణాల్లో... - మెదక్​ జిల్లా తూప్రాన్​ వద్ద లారీ బోల్తా

By

Published : Apr 20, 2023, 7:47 PM IST

Medak Viral Video: జాతీయ రహదారిపై లారీ బోల్తాపడి.. అందులో ఉన్న మేక తలకాయలు, కాళ్లు కింద పడడంతో జనాలు వాటిని తీసుకెళ్లారు. ఈ ఘటన మెదక్​ జిల్లా తూప్రాన్​లోని 44వ జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్​ వైపు మేక కాళ్లు, తలకాయలతో వస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వచ్చి వాటిని తీసుకొని వెళ్లడానికి పోటీపడ్డారు.  

హైదరాబాద్​లో మేక కాళ్లు, తలకాయలకు భారీ డిమాండ్​ ఉండడంతో నిత్యం మహారాష్ట్ర నుంచి ఇక్కడకు లారీల ద్వారా తరలిస్తుంటారు. ఈ నేపథ్యంలో మెదక్​ జిల్లా తూప్రాన్​ వద్దకు వచ్చేసరికి లారీ బోల్తాపడడంతో.. అందులోని ఫ్రిజ్​ బాక్స్​లో ఉన్న మేక తలకాయలు, కాళ్లు రహదారిపై కిందపడ్డాయి. ఒక్కసారిగా అక్కడకు జనం చేరుకొని.. సంచుల్లో వేసుకొని తీసుకెళ్లారు. కొందరైతే లారీలోపల ఉన్న బాక్స్​​లలో ఉన్నవి కూడా తీసుకువెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చేసరికి లారీలో సరకు మొత్తం ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details