Lokesh Bail Petition : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టులో ముగిసిన విచారణ.. 'లోకేశ్ ముందస్తు బెయిల్'పై మధ్యాహ్నం వాదనలు!
Published : Sep 29, 2023, 1:41 PM IST
Lokesh Bail Petition : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌పై గతేడాది కేసు నమోదు చేసిన సీఐడీ.. కేసులో ఇటీవలే లోకేశ్ పేరును చేరుస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. విచారణ సందర్భంగా.. అమరావతి రింగురోడ్డు కేసులో సీఆర్పీసీ (CRPC) 41A ప్రకారం లోకేశ్ కు ముందస్తు నోటీసులు ఇస్తామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. ఇన్నర్ రింగురోడ్డు కేసులో లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏజీ శ్రీరాం ఈ విషయాన్ని కోర్టుకు వివరించారు.
అడ్వకేట్ జనరల్ ఇచ్చిన వివరాలను హైకోర్టు నమోదు చేసుకుంది. అరెస్టు గురించి ఆందోళన లేనందున ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. గత ఏడాది నమోదైన ఈ కేసులో ఇటీవలే లోకేశ్ పేరును చేరుస్తూ ఏసీబీ (ACB) కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. మరోవైపు ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసుల్లో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అత్యవసరంగా విచారించాలని హైకోర్టును కోరారు. మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది.