నేటి అవసరాలకు తగిన యాప్ రూపకల్పన - లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్న యువకుడు - Bharat Interview
Published : Jan 4, 2024, 4:41 PM IST
Local Dukan App Developer Bharat Interview : బీటెక్ పూర్తిచేయాలి. మంచి ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ కొలువు సంపాదించాలి. ఇదీ నేటి యువతరంలో చాలామంది కోరుకునేది. కానీ ఆ యువకుడు మాత్రం చదువైన వెంటనే బిజినెస్ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. తనతో పాటు సాటివారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అనుకున్నాడు. మొబైల్ యాప్‌లపై ఒక అవగాహన వచ్చాక, స్నేహితులతో కలసి ఒక విభిన్నమైన యాప్‌ను రూపొందించాలి అనుకున్నాడు. దీంతో హైదరాబాద్‌కు వచ్చి కొన్ని నెలలు శిక్షణ పొందాడు. కానీ అది ఫలితాన్ని ఇవ్వలేకపోవడంతో తన స్నేహితులతో కలిసి ఒక యాప్ డెవలప్ చేశాడు. ప్రారంభదశలో ఇబ్బందులు అధైర్యపడకుండ తన తండ్రి మద్ధతుతో 'లోకల్ దుకాణ్'అనే యాప్‌ను డెవలప్ చేసి దాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాడు. వివిధ రకాల సేవలందించే ఆ యాప్ ఏంటో? సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను మించి నెలకు రూ.3 నుంచి 4 లక్షల ఆదాయం ఎలా అందుకోగలుగుతున్నాడో, సంగారెడ్డికి చెందిన భరత్ మాటల్లోనే విందాం.