ఆన్లైన్లో ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి కలకలం - హైదరాబాద్‌లోని బావర్చి బిర్యానీలో బల్లి
Published : Dec 3, 2023, 2:21 PM IST
Lizard In Bawarchi Biryani In Hyderabad: హైదరాబాద్‌లో బిర్యానీ ఎక్కడ బావుంటుంది అనగానే గుర్తుకువచ్చే రెస్టారెంట్లలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బావర్చి హోటల్. విశ్వ అనే బాలుడికి వింత అనుభవం ఎదురైంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేయగా, డెలివరి బాయ్ నుంచి ఆర్డర్‌ను తీసుకున్న బాలుడు దాన్ని తీసి చూడగా బిర్యానీలో బల్లి కలకలం రేపింది. దీంతో బావర్చీ హోటల్ ముందు బాధితులు ఆందోళన చేశారు. అంబర్ పేట్ నివాసి విశ్వ బిర్యానీని జొమాటోలో ఆన్లైన్లో ఆర్డర్ చేయగా, దానిలో బల్లిని చూసి వెంటనే తన తల్లి సౌమ్యకు తెలియజేశాడు.
A Lizard In A restaurant In Hyderabad : ఈ విషయంపై జొమాటో కంపెనీకి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బావర్చి హోటల్‌కి ఫిర్యాదు చేయగా, స్పందించకపోవడంతో ఆమె హోటల్‌కి ముందు నిరసన వ్యక్తం చేసింది. దీంతో అక్కడ తిన్న అనేకమంది వినియోగదారులు తినకుండా సగంలో వదిలి వెళ్ళిపోయారు. వెంటనే పోలీసులు తెరిచి ఉన్న బావర్చీ హోటల్లు మూసి వేసి, అందరినీ తిరిగి పంపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బాధితులు అధికారులను కోరుతున్నారు.