తెలంగాణ

telangana

Constable attack on Singareni employee

ETV Bharat / videos

Constable attack on Singareni employee : మద్యం మత్తులో సింగరేణి ఉద్యోగిపై కానిస్టేబుల్​ దాడి.. సీసీ కెమెరాలో దృశ్యాలు

By

Published : Jun 12, 2023, 7:59 PM IST

Constable attack on motorist in Kamanpur : పెద్దపల్లి జిల్లా కమాన్​పూర్​ మండలంలో మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ వాహనాదారున్ని ఢీ కొట్టడమే కాకుండా అతనిపై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు, బాధితుడు కథనం ప్రకారం.. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పోగుల అజయ్ అతని బంధువు ఇద్దరు కలసి కమాన్​పూర్ క్రాస్‌ రోడ్ వద్ద వైన్ షాప్​ దగ్గర మద్యం తాగారు. ఆ తరువాత వారి బైక్​ తీసుకొని రోడ్డు మీదకు వస్తుండగా.. అటు నుంచి వస్తున్న సింగరేణి ఉద్యోగి శనిగరపు సమ్మయ్య అనే వ్యక్తిని ఢీ కొట్టారు. ఈ సమయంలో ఇద్దరు బైక్​ మీద నుంచి పడిపోయారు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి లోనైన కానిస్టేబుల్​ సింగరేణి ఉద్యోగిపై.. దాడికి పాల్పడ్డారు. పరుష పదజాలంతో దూషించారు. స్థానికుల వచ్చి నచ్చజెప్పడంతో వివాదం సద్దుమనిగింది. ఈ ఘటనపై స్థానిక ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతయుతమైన వృత్తిలో ఉన్న వారే తప్పతాగి డ్రైవ్ చేస్తుంటే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details