తెలంగాణ

telangana

ETV Bharat / videos

ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసులో చిరుత సంచారం - cheetah come into the population

By

Published : Dec 22, 2022, 10:56 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

ఉత్తరాఖండ్​లో చిరుత కలకలం సృష్టించింది. చంపావత్​ జిల్లాలోని సీఎం క్యాంపు ఆఫీసులో రాత్రిపూట చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది. మార్జినల్ టెరాయ్ ప్రాంతాంలోని జనావాసాల చుట్టూ చిరుత కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత తిరిగే ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను పెంచామని తనక్‌పూర్ ఫారెస్ట్ ఆఫీసర్ మహేష్ సింగ్ తెలిపారు. వన్యప్రాణులు, మనషులకు మధ్య ఎటువంటి సంఘర్షణ జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details