ముంబయి ఫిల్మ్‌సిటీలో చిరుత హల్చల్.. సీరియల్ సెట్లోకి దూరి..
Leopard In Film City : ముంబయిలోని తూర్పు గోరేగావ్‌లో ఉన్న ఫిల్మ్‌సిటీలో చిరుత కలకలం సృష్టించింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో టీవీ సీరియల్ సెట్లోకి ప్రవేశించింది. ఓ కుక్కపై దాడి చేసి చంపేసింది. చిరుత ప్రవేశించిన సమయంలో సెట్లో దాదాపు 200 మంది ఉన్నారు. భయాందోళనకు గురైన సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సెట్లో చిరుత సంచరిస్తున్నప్పుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగిందని రాష్ట్ర అటవీ శాఖ వన్యప్రాణి వార్డెన్, రెస్‌కింక్ అసోసియేషన్ ఫర్ వైల్డ్‌లైఫ్ వెల్ఫేర్ (RAWW) వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ శర్మ తెలిపారు. అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారని చెప్పారు. అయితే, ఆహారం వెతుక్కూంటూ చిరుత ఫిల్మ్‌సిటీలోకి వచ్చిందని తెలిపారు.
విశాలమైన ఫిల్మ్ సిటీ.. ముంబయిలోని అటవీ ప్రాంతమైన ఆరే మిల్క్ కాలనీకి ఆనుకుని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సరిహద్దులో ఉంది. ఇది చిరుతపులులకు నిలయం అని పవన్ చెప్పారు. ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు రోజూ పెట్రోలింగ్ చేస్తారని తెలిపారు. చిరుత పులులు ఉండే ప్రాంతంలో అప్రమత్తంగా ఉండటం, అటవీ శాఖ సూచనలు, సలహాలను పాటించడం ముఖ్యమని అన్నారు. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని.. చీకటిలో ఒంటరిగా వెళ్లకూడదని పవన్ సూచించారు. చీకటిలో నడిచేటప్పుడు టార్చ్‌లైట్ ఉపయోగించాలని చెప్పారు.
TAGGED:
ముంబయి ఫిల్మ్‌సిటీలో చిరుత