ఇళ్ల మధ్యలోకి వచ్చి బీభత్సం సృష్టించిన చిరుత - కర్ణాటక మైసూర్ చిరుతపులి లేటెస్ట్ న్యూస్
కర్ణాటకలో ఓ చిరుతపులి జనావాసాల్లోకి వచ్చి కొందరిపై దాడి చేసింది. శుక్రవారం ఉదయం మైసూర్ జిల్లాలోని కేఆర్ నగర్ ప్రాంతం శివార్లలో ఉన్న కనక నగర్లో ఓ చిరుత ప్రజలను పరుగులు పెట్టించింది. ముళ్లూరు రోడ్డు సమీపంలో ఉన్న రాజా ప్రకాష్ స్కూల్ రోడ్డులో ఓ వ్యక్తి బైక్పై వెళ్తుండగా అతనిపై దాడి చేసింది. ఆ తరువాత మరో ఇద్దరిపై దాడి చేసింది. దీంతో ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. వెంటనే స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాను. సిబ్బంది వచ్చి పులికి మత్తుమందు ఇచ్చి బోనులో బంధించారు. అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST