తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇంట్లోకి ప్రవేశించి హల్​చల్​ చేసిన చిరుత భయంతో ప్రజల పరుగులు - పులిని పట్టుకొన్న అటవీ సిబ్బంది

By

Published : Jan 7, 2023, 10:52 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​​ ప్రాంతంలో ఓ చిరుత ఇంట్లోకి ప్రవేశించింది. జనావాసాల్లోకి చిరుత రావడం వల్ల ప్రజలంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రజలంతా చేతిలో కర్రలతో బయటకు వచ్చారు. దీంతో ఆ చిరుత ఓ ప్రభుత్వ పాఠశాల గదిలోకి ప్రవేశించింది. అనంతరం అక్కడ నుంచి మరో ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఓ మహిళ కూడా ఉంది. ఆమె పులిని గమనించి వంటగదిలో డోర్ వేసుకొని ఉండిపోయింది. అయితే ఇంట్లో ఉన్న పులిని చూడడానికి జనం గూమిగూడారు. ఈ పులి ఓ చిన్నారిని గాయపరచినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకొన్న అటవీ సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పులిని బంధించి పట్టుకొన్నారు. ఆ తర్వాత పులిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details