అడవిలో నుంచి వచ్చి ముగ్గురిపై విరుచుకుపడ్డ చిరుత - uttarakhand latest updates
ఉత్తరాఖండ్లో చిరుత సంచారం అందరిని కలవరపెడుతోంది. ఇదివరకే ఓ 10 ఏళ్ల చిన్నారిని గాయపరిచిన ఘటన మరువక ముందే ఇప్పుడు మరోసారి ఓ చిరుత బీభత్సం సృష్టించింది. అల్మోడాలో మంగళవారం కుళాయి సరిచేసేందుకు నిల్చున్న ముగ్గురు వ్యక్తులపై అడవివైపు వెళ్తున్న ఓ చిరుత అమాంతం దూసుకొచ్చి దాడి చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడ్డ బాధితులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST