వీధి కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత.. వీడియో వైరల్ - కుక్కపై చిరుత దాడి
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని నివాస ప్రాంతాల్లో అటవీ జంతువుల సంచారం ఇటీవల పెరిగింది. తాజాగా నగరంలోకి ప్రవేశించిన ఓ చిరుత.. వీధి శునకాన్ని వేటాడింది. సుఖి నదీ ప్రాంతంలో అర్ధరాత్రి కుక్కను నోట కరుచుకుని లాక్కెళుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. చిరుత సంచారంతో పట్టణ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST