తెలంగాణ

telangana

ETV Bharat / videos

నిమ్మకాయలు ఎప్పటికీ ఫ్రెష్​గా ఉండాలంటే ఈ టిప్స్​ ఫాలో కావాల్సిందే - నిమ్మకాయలు ఎలా ఎక్కువ కాలం నిల్వ చేయాలి

By

Published : Jan 14, 2023, 4:49 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

నిమ్మకాయలు నిల్వ చేసేందుకు కొన్ని ప్రత్యేక చిట్కాలు చెబుతున్నారు నిపుణులు. కొద్ది మొత్తంలో నిమ్మరసం అవసరమైనప్పుడు దాన్ని రెండు ముక్కలుగా కాకుండా చిన్న రంధ్రం చేసుకుంటే సరిపోతుంది. అలా రంధ్రం చేసిన దానికి నూనె అద్దించి ఫ్రిజ్​లో పెట్టుకుంటే అందులోని తేమ బయటకు పోకుండా ఫ్రెష్​గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. గాలి లోపలకు చొరబడని ఓ సీసాలో నీటిని నింపి అందులో నిమ్మకాయలు వేస్తే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. అలా కాకుండా మార్కెట్​లో దొరికే అల్యూమినియం ఫాయిల్​తో నిమ్మకాయలను చుట్టి ఫ్రిజ్​లో పెట్టుకుంటే అవి ఎక్కువ రోజులు గట్టి పడకుండా తాజాగా ఉంటాయి. ఎండిపోయిన వాటిని కూడా వేడి నీటిలో వేసి దాదాపు 10 నుంచి 15 నిమిషాలు మరిగించడం ద్వారా వాటిలోని కమ్మని రసాన్ని తిరిగి పొందవచ్చు.

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details